Abn logo
Mar 26 2020 @ 09:10AM

రష్యాలోని కురిల్‌ దీవుల్లో భూకంపం

మాస్కో, మార్చి 25: రష్యాలోని కురిల్‌ దీవుల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.2గా నమోదైంది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కురిల్‌ దీవుల్లోని సెవెరో పట్టణానికి 210 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్‌ సముద్రంలో భూకంప కేంద్రం ఉందన్నారు. దీంతో మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తర్వాత ఉపసంహరించుకున్నారు. సెవెరో పట్టణంలో 2500 మంది ఉన్నారు. వీరిలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement