Abn logo
Jul 12 2020 @ 05:07AM

ఆల్మట్టికి పెరుగుతున్న వరద

ప్రాజెక్టుకు 73,791 క్యూసెక్కుల నీరు

వారం రోజుల్లో జూరాలకు చేరే అవకాశం


గద్వాల, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు శనివారం 73,791 క్యూసెక్కుల వరద వచ్చింది. ఆల్మట్టి నుంచి 27,756 క్యూసెక్కుల నీరు నారాయణపూర్‌కు చేరుతోంది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇదే తీరులో మూడు నాలుగు రోజులు వరద కొనసాగితే జూరాలకు నీరొచ్చే అవకాశం ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 92.45 టీఎంసీల నీరు చేరింది.


నారాయణపూర్‌ ప్రాజెక్టులో 37.64 టీఎంసీలకు గాను, 29.88 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టులో 9.66 టీఎంసీలకు గాను, 7.88 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం జూరాలకు 1,488 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే తుంగభధ్రా నదికి ఆశించిన స్థాయిలో వరద రావడం లేదు. తుంగభద్ర డ్యామ్‌కు 34,374 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 100.86 టీఎంసీలకు గాను, 18.25 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.

Advertisement
Advertisement