Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 1 2021 @ 22:03PM

"Lucky" పూర్తి వ్యాక్సిన్ విజేతకు రూ. 60 వేల విలువైన స్మార్ట్‌ఫోన్

అహ్మదాబాద్: కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పెంచే ప్రయత్నంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ప్రయత్నం చేస్తోంది."లక్కీ" పేరుతో పూర్తిగా వ్యాక్సిన్  పొందిన విజేతకు రూ. 60,000 స్మార్ట్‌ఫోన్ ఇవ్వనున్నట్లు ఏఎంసీ పేర్కొంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 మధ్య పూర్తిగా వ్యాక్సిన్ పొందిన వారు ఈ స్కీమ్‌కు అర్హులని, విజేతను లక్కీ డ్రా ద్వారా ప్రకటించబడుతుందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. టీకాలు వేయడానికి అర్హులైన వ్యక్తులను ఆకర్షించడానికి ఏఎంసీ ఎప్పటికప్పుడు పథకాలను రూపొందిస్తోంది. 100 శాతం టీకాల లక్ష్యాన్ని సాధించడానికి ఏఎంసీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా నగరంలోని మురికివాడల నుంచి వేలాది మంది లబ్ధిదారులకు ఏఎంసీ ముందుగా ఎడిబుల్ ఆయిల్ ప్యాకెట్లను పంపిణీ చేసింది.

Advertisement
Advertisement