Abn logo
Oct 5 2020 @ 04:40AM

ఉమ్మడిజిల్లాలో 589 కరోనా కేసులు

Kaakateeya

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) :  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనావ్యాప్తి రోజురోజుకూ పెరుగు తోంది. ఆదివారం 589 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిజిల్లాలో 414 కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ జిల్లాలో 166 కేసులు, వికారాబాద్‌ జిల్లాలో కేవలం 9 కేసులు నమోదయ్యాయి. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో..

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో ఆదివారం ఆరు కేంద్రాల్లో కరోనా టెస్టులు నిర్వహించగా 13 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 8, మంచాలలో ఒకరికి, ఎలిమినేడులో 3, రాగన్నగూడలో ఒకరికి పాజిటివ్‌ అని తేలింది.


ఘట్‌కేసర్‌లో...

ఘట్‌కేసర్‌ : ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద ప్రత్యేక మొబైల్‌ వాహనం ద్వారా 63మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితం 24గంటల తర్వాత వెలువడుతుందని వివరించారు. సేకరించిన శాంపిళ్లను నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి పంపిం చామని వైద్యులు తెలిపారు


షాద్‌నగర్‌ డివిజన్‌లో...

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో 139మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో షాద్‌నగర్‌కు చెందిన ఐదుగురు, ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన నలుగురు ఉండగా మరో ముగ్గురు ఇతర మండలాలకు చెందిన వారున్నారు.


చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌లో 157 మందికి  కరోనా పరీక్షలు చేయగా 11మందికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 12 మందికి పరీక్షలు చేయగా 2, ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో 75 పరీక్షలు చేయగా 1, శంకర్‌పల్లి మండలంలో 43 మందికి పరీక్షలు చేయగా 6, మొయినాబాద్‌ మండలంలో 28 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా షాబాద్‌ మండలంలో 27మందికి పరీక్షలు చేయగా ఒక్కరికీ పాజిటివ్‌ రాలేదు. 


కరోనా భయంతో మహిళ మృతి 

తలకొండపల్లి : కరోనా భయంతో తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది. 10 రోజులుగా జ్వరం వస్తుండటంతో భార్యాభర్తలిద్దరూ ఆదివారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. దీంతో భార్య ఆందోళనతో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు, ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. కాగా అంబులెన్స్‌లో మృతదేహాన్ని హైదరాబాద్‌లోని విద్యుత్‌ శ్మశాన వాటికకు తరలించారు. కరోనా బారినపడిన మృతురాలి భర్తను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. 

Advertisement
Advertisement