Abn logo
Jun 19 2021 @ 17:49PM

ఏపీలో కొత్తగా 5,674 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 5,674 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 18,44,917కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో  45 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 12, 269 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65,244 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 17,67,404 మంది రికవరీ అయ్యారు. ఏపీలో 24 గంటల్లో 8,014 మంది రికవరీ అయ్యారు. ఏపీలో 24 గంటల్లో 1,03,935 కరోనా టెస్టుల నిర్వహించారు. 


కొత్తగా చిత్తూరు జిల్లాలో 9 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, శ్రీకాకుళం, విశాఖ, ప.గో జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.