Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీఎస్టీ పరిహారం కింద ఏపీకి రూ.543 కోట్లు

ఢిల్లీ: జీఎస్టీ పరిహారం కింద ఏపీకి రూ.543 కోట్లను విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కరోనా నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా తగ్గాయని పేర్కొంది. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం వాటా పెరిగిందన్నారు. కానీ ఆ మేరకు చెల్లింపులు చేసేందుకు జీఎస్టీ కాంపెన్సేషన్‌ ఫండ్‌లో నిధులు లేవన్నారు. జీఎస్టీ వసూళ్లలోని భారీ లోటు, రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలపై జీఎస్టీ కౌన్సిల్‌లో పలుమార్లు చర్చలు జరిపామని కేంద్రం పేర్కొంది. జీఎస్టీ రెవెన్యూలో తరుగుదలను పూడ్చేందుకు క్రమం తప్పకుండా జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది.


Advertisement
Advertisement