Abn logo
Jun 4 2020 @ 08:28AM

బైకుపై డబుల్స్‌ వెళ్తే రూ.500 జరిమానా

చెన్నై : రాజధాని నగరం చెన్నైలో ట్రాఫిక్‌ నిబంధనలు కఠిన తరమయ్యాయి. బైకులు, స్కూటర్లపై ఇద్దరు ప్రయాణిస్తే రూ.500 జరిమానా విధిస్తున్నారు. ఈ కొత్త ఉత్తర్వులు అమలులోకి వచ్చినట్లు ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఐదో విడత లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతుండంతో వాహనాలపై వెళ్లేవారి సంఖ్యను బాగా తగ్గించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు పలుచర్యలు చేపడుతున్నారు. అయితే ఆ జరిమనాపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగిన రవాణా సదుపాయం కల్పించకుండా ప్రభుత్వం ఇలా కొత్త నిబంధనలు అమలు చేసి అపరాధ రుసుం పేరుతో వసూళ్లు చేయడం భావ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement