Abn logo
Mar 31 2020 @ 18:16PM

ఒక్కరోజులో 500 మందికి కరోనా.. దేశంలో ఇదే అత్యధికం

మాస్కో: రష్యాలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ఏడు రోజులుగా కేసులు అంతకంతకూ పెరుగుతునే ఉన్నాయి. కేవలం 24 గంటల్లోనే 500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 2,337 కోవిడ్-19 కేసులు నమోదైనట్లు అధికారికంగా వెల్లడైంది. అంతేకాకుండా కరోనా వల్ల ఇప్పటివరకు 18 మరణాలు సంభవించాయని, అయితే 121 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, దానివల్ల కొంత మేర కరోనా వృద్ధిని అరికట్టగలుగుతున్నామని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement