Abn logo
May 22 2020 @ 14:42PM

ట్రాఫిక్ జ‌రిమానాల‌పై 50 శాతం డిస్కౌంట్...

అబుధాబి: ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన వాహ‌న‌దారుల‌కు అబుధాబి ప్ర‌భుత్వం కొంత వెసులు బాటు క‌ల్పించింది. వాహ‌న‌దారులు త‌మ‌కు గ‌ల జ‌రిమానాల‌ను జూన్ 22వ తేదీ లోపు చెల్లిస్తే 50 శాతం త‌గ్గింపు ఇస్తామ‌ని అబుధాబి ట్రాఫిక్ పోలీస్ విభాగం వెల్ల‌డించింది. నెల రోజుల లోపు జ‌రిమానాలు చెల్లించిన వారికి 50 శాతం, రెండు నెల‌ల లోపు చెల్లిస్తే 35 శాతం, రెండు నెల‌ల క‌న్నా ఎక్కువ కాల వ్య‌వ‌ధిలో క‌డితే 25 శాతం త‌గ్గింపు ఇవ్వ‌నున్న‌ట్లు పోలీసులు తెలియ‌జేశారు. కాగా, ఏదైనా ప్ర‌మాద‌క‌ర‌మైన నేరాల‌కు పాల్ప‌డిన స‌మ‌యంలో జారీ చేసిన జ‌రిమానాల‌కు మాత్రం ఈ డిస్కౌంట్ వ‌ర్తించ‌ద‌న్నారు. ఈ జ‌రిమానాల చెల్లింపు కోసం అబుధాబి పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌ లేదా మొబైల్ యాప్‌ను వినియోగించి బ్యాంక్ క్రెడిట్ కార్డుల‌తో చేయొచ్చ‌ని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement