Abn logo
Oct 15 2020 @ 01:49AM

50శాతం పంటలకు నష్టం

కొడంగల్‌/కొడంగల్‌రూరల్‌/దౌల్తాబాద్‌/బొంరాస్‌పేట్‌: కొడంగల్‌ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌, కొడంగల్‌, కోస్గి, మద్దూర్‌ మండలాల్లో రైతులు సాగు చేసిన పంటల్లో సగం పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట 25శాతం మేర నష్టపోయినట్లు అధికారుల అంచనా. కొడంగల్‌ మండలంలోని పర్సాపూర్‌ గ్రామంలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.  మండలంలోని చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఐదేళ్లుగా ఒట్టిపోయిన నందిగామ చెరువులోకి నీరు చేరి అలుగు పారుతోంది.


దౌల్తాబాద్‌ మండలంలోని దౌల్తాబాద్‌, నందారం, ఈర్లపల్లి, చల్లాపూర్‌, బాలంపేట్‌, కుదరుమళ్ల, బిచ్చాల్‌, అంతారం, దేవరఫస్లాబాద్‌ తదితర గ్రామాల్లో పత్తి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బొంరాస్‌పేట్‌ చెరువులో నీటి ఉధృతి పెరగడంతో తుంకిమెట్లకు వెళ్లే రహదారిపై ఉన్న కల్వర్టుపై నుంచి అలుగు పారుతుంది. మహంతీపూర్‌ సమీపంలో కాగ్నా పొంగిపొర్లడంతో బొంరాస్‌పేట్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement
Advertisement