Abn logo
May 4 2021 @ 10:38AM

అఫ్జల్‌గంజ్‌‌లో కానిస్టేబుల్‌పై యువకుల దాడి.. తీవ్ర గాయాలు

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌ : ఓ కానిస్టేబుల్‌పై ఐదుగురు యువకులు దాడి చేసిన ఘటన కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ రాహుల్‌ ఆదివారం రాత్రి తన ఇంటి సమీపంలో బైక్‌పై కూర్చున్నాడు. మరో బైక్‌పై రంజిత్‌ అనే యువకుడు అటుగా వెళ్తూ రాహుల్‌ను పక్కకు జరగాలన్నాడు. బైక్‌ వెళ్లేందుకు స్థలం ఉంది కదా వెళ్లాలంటూ రాహుల్‌ సూచించాడు. కొంతసేపటికి తర్వాత రంజిత్‌ ఐదుగురు యువకులతో వచ్చి కలిసి రాహుల్‌ తలపై, ముఖంపై తీవ్రంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన కానిస్టేబుల్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దాడి చేసిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
Advertisement