Abn logo
Oct 25 2020 @ 16:30PM

5 ఏళ్ల బాలికను చెరిచాడంటూ 13 ఏళ్ల బాలుడిపై ఫిర్యాదు!

Kaakateeya

ఫతేపూర్: పదమూడేళ్ల బాలుడు ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. శనివారం నాడు బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా ఆమెను నిందితుడు ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలోని ఖాగా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు తొలుత ఈ వివాదాన్ని పోలీసుల దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండానే పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కానీ..పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయాలని బాలిక కుటుంబం నిర్ణయించుకుంది. కాగా..నిందితుడిపై పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement