Abn logo
Mar 28 2020 @ 07:40AM

హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో ట్రక్‌ను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ సమీపంలోని పెద్ద గోల్కొండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా కర్ణాటకలోని రాయచూర్‌కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.


కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో పనులు లేక 30 మంది కూలీలు తమ స్వస్థలమైన రాయచూర్‌కు బొలెరో వ్యాన్‌లో సూర్యాపేట నుంచి బయలు దేరారు. వీరి వాహనం పెద గోల్కొండ వద్దకు రాగానే మామిడిపండ్ల లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరగ్గానే లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.  

Advertisement
Advertisement
Advertisement