Abn logo
Sep 30 2020 @ 03:38AM

‘పూరీ’ ఆలయంలో 400 మందికి కరోనా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: దేశంలో కరోనా కొత్త కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో తగ్గాయి. గత 24 గంటల్లో 70,509 మందికి వైరస్‌ సోకిందని, 776 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. సెప్టెంబరులో వెయ్యిలోపు కేసులు తొలిసారి రికార్డయ్యాయి. కొత్తగా 84 వేల మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది. మొత్తం రికవరీలు 51లక్షలు దాటాయని, ప్రపంచంలో ఇదే అత్యధికమని కేంద్రం వివరించింది. ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌ సోకింది. వీరిలో 9 మంది చనిపోయారు. ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ మరో 11 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్‌ వచ్చింది. 

Advertisement
Advertisement
Advertisement