Abn logo
Oct 13 2021 @ 00:09AM

జిల్లాలో కొత్తగా 4 కరోనా కేసులు

కామారెడ్డిటౌన్‌,అక్టోబరు 12: జిల్లాలో మంగళవారం నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే, జిల్లాలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 31,712 కాగా, డిశ్చార్జి కేసులు 31,652, మొత్తం మరణాల సంఖ్య 167కు చేరినట్లు సమాచారం.