Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంటి వద్దే ఆడుకుంటున్న ఆరేళ్ల కూతురు సడన్‌గా అదృశ్యం.. 50 మీటర్ల దూరంలో ఉన్న ట్రక్కులో ఊహించని విధంగా చూసి..

ఇంటర్నెట్ డెస్క్: ఆ చిన్నారికి ఆరేళ్లు. ఇంటి వద్దే స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉంది. దీంతో తల్లిదండ్రులు.. వారి వారి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే అప్పటి వరకూ ఇంటి వద్దే ఉన్న కూతురు అకస్మాత్తుగా కనిపించకపోవడంతో వాళ్లు కంగుతిన్నారు. ఆ తర్వత 50 మీటర్ల దూరంలో ఉన్న ట్రక్కులో ఊహించని విధంగా చూసి షాకయ్యారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌కు చెందిన దంపతులకు ఆరేళ్ల కూతురు ఉంది. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు.. గురువారం రోజు స్నేహితులతో కలిసి ఇంటి వద్దే ఆడుకుంటూంటే అది చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి.. వారి వారి పనుల్లో బిజీ అయిపోయారు. కొద్ది సమయం తర్వాత ఇంట్లోంచి బయటికొచ్చి చూస్తే.. వారికి తమ కూతురు కనిపించలేదు. అప్పటి వరకూ అక్కడే ఆడుకున్న బిడ్డ.. ఎక్కడికి వెళ్లిందని చుట్టుపక్కల వారిని అడిగి చూశారు. అయినా తమ కూతురు జాడ వారికి దొరకలేదు. 


ఈ క్రమంలో శుక్రవారం రోజు ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో శనివారం రోజు పోలీసులు రంగంలోకి దిగారు. పాప ఆచూకీ కోసం విచారణ జరుపుతూ.. 50 మీటర్ల దూరంలో ఉన్న ట్రక్కులో  చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ట్రక్కులో తమ కూతురు విగత జీవిలా పడి ఉండటాన్ని చూసి, ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇంటి యజమానే ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు. అమ్జద్ (38) అనే వ్యక్తి ఆ పాపను ఎత్తుకెళ్లి.. అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్టు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement