Abn logo
Oct 22 2020 @ 00:44AM

ఉమ్మడి జిల్లాలో 373 కరోనా కేసులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం 373 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 191 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. అలాగే మేడ్చల్‌ జిల్లాలో 169, వికారాబాద్‌ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడు జిల్లాల్లో బాధితుల సంఖ్య 92,440కి చేరుకుంది. 


చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌పరిధిలో 90 మందికి  కరోనా పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 12 మందికి పరీక్షలు చేయగా ఒకరికి, ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో ఐదుగురికి కరోనా పరీక్షలు చేయగా ముగ్గురికి, శంకర్‌పల్లి మండలంలో 31 మందికి పరీక్షలు చేయగా ఒకరికి, మొయినాబాద్‌ మండలంలో 32మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. షాబాద్‌ మండలంలో 10 మందికి  పరీక్షలు చేయగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు.


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో బుధవారం 185 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో కొత్తూర్‌ మండలానికి చెందిన నలుగురు, ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన ఒకరు ఉన్నట్లు వివరించారు.


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో..

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 11 కేంద్రాల్లో 186 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 12మందికి పాజిటివ్‌ వచ్చింది. యాచారంలో ఒకరికి, మంచాలలో ఒకరికి, ఎలిమినేడులో ఒకరికి, అబ్దుల్లాపూర్‌మెట్‌ 2, తట్టిఅన్నారంలో ఒకరికి, హయత్‌నగర్‌ 4, రాగన్నగూడలో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది.


కీసరలో 6 కేసులు..

కీసర: కీసరలో 35 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement