Abn logo
May 22 2020 @ 22:04PM

గుజరాత్‌లో కొత్తగా 363 కరోనా కేసులు

అహ్మదాబాద్: దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటల్లో గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా 363 కరోనా కేసులు నమోదయ్యాయి అధికారులు వెల్లడించారు. దీంతో గుజరాత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,200కు చేరింది. ఈ వివరాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. అలాగే కొత్తగా 29 కరోనా మరణాలు సంభవించడంతో, రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 802కు చేరిందని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకూ గుజరాత్‌లో 5,880 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement