Abn logo
Oct 24 2020 @ 19:44PM

బెంగళూరులో వరద నీటిలో చిక్కుకుపోయిన 300 ఇళ్లు

Kaakateeya

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పడిన కుండ పోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలో దక్షిణ బెంగళూరులో భారీ వర్షం కురవడంతో కనీసం 300 ఇళ్లు నీటిలో చిక్కుకుపోయాయి.


ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరదకు వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న బీబీఎంపీ అధికారులు పలు ఇళ్లకు ఆహారం, మంచి నీటిని సరఫరా చేశారు. బీటీఎం లేఅవుట్, రాజరాజేశ్వరి నగర్, కెంగేరి, బసవనగుడి, జయనగర్, బొమ్మనహళ్లి, సరక్కి, శాంతినగర్ మరియు బనశంకరిలోని కొన్ని ప్రాంతాల్లో వరదనీటితో రోడ్లు మునిగిపోయాయి.

Advertisement
Advertisement