Abn logo
Mar 30 2020 @ 08:29AM

మూడేళ్ల పసివాడిని హత్య చేసిన కన్నతండ్రి.. కారణం తెలిస్తే..

కర్నూలు: పసిపిల్లలు అల్లరి చేస్తుంటే సమయమే తెలియదు. ఇల్లంతా సందడిగా మారిపోతుంది. అలాంటిది ఓ కన్నతండ్రి తన కుమారుడిని హత్య చేసిన కారణం తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. అల్లరి చేస్తున్నాడని మూడేళ్ల పసివాడిని కన్నతండ్రే కడతేర్చిన దారుణ ఘటన కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. జుల్సీ(3) అనే చిన్నారిని కన్నతండ్రే దారుణంగా హతమార్చాడు. కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
Advertisement