Abn logo
Oct 23 2021 @ 00:07AM

దోపిడీ కేసులో నిందితుల అరెస్టు

వివరాలు తెలుపుతున్న డీఎస్పీ

రూ. 1.47 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

తణుకు, అక్టోబరు 22: పట్టణ పరిధిలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో  ఒంటరిగా ఉన్న వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ బి. శ్రీనాథ్‌ చెప్పారు. శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న అల్లూరి శివరామకృష్ణంరాజుపై  ముగ్గురు వ్యక్తులు  దాడి చేసి రెండు బంగారు ఉంగరాలు,  సెల్‌ఫోన్‌, మోటారు సైకిల్‌ను దొంగిలించారన్నారు. దీనిపై పట్టణ ఎస్‌ఐ కె.గంగాధర రావు కేసు నమోదు చేసి,  సీఐ  చైతన్యకృష్ణ దర్యాప్తు చేశారన్నారు. చోరీకి పాల్పడిన నిందితులు పైడిపర్రుకు చెందిన జీళ్ళ గోపాలకృష్ణ, బూర్ల సాయి, కొప్పనాతి పృథ్వీనారాయణలను శుక్రవారం అరెస్టు చేశారన్నారు.  24 గంటల వ్యవధిలో  సీఐ చైతన్యకృష్ణ నిందితులను అరెస్టు చేయడంతో పాటు రూ.  లక్షా 47 వేల  500 విలులైన సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఏఎస్‌ఐలు శ్రీధర్‌, పోలయ్య కాపు, హెచ్‌సీలు సత్యనారాయణ, పీసీలు అన్వర్‌, అక్బర్‌, మహేష్‌లను  ఉన్నతాధికారులు అభినందించినట్టు తెలిపారు.