Abn logo
Jul 11 2020 @ 04:37AM

ఎంజీఎంలో 28 కరోనా పాజిటివ్‌ కేసులు

హన్మకొండ అర్బన్‌, జూలై 10 :  వరంగల్‌ ఎంజీఎంలో శుక్రవారం 28 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు  సూపరింటెండెంట్‌  శ్రీనివాసరావు తెలిపారు. ఎంజీఎం కోవిడ్‌ విభాగంలో 14  కేసులు నమోదు కాగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన పరీక్షల్లో పది మందితో పాటు మొత్తం 28 మంది కరోనా బాధితులుగా గుర్తించినట్లు తెలిపారు. బాధితులను కోవిడ్‌ విభాగంలోని ఐసోలేషన్‌ వార్డులో వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన స్పష్టం చేశారు.  


శుక్రవారం ఒక్క రోజు 40 మంది కరోనా అనుమానితులను అడ్మిట్‌ చేసుకొని వారి నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. ఇందులో కరోనా లక్షణాలు కనిపించని 14 మంది బాధితులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి స్వీయ, గృహ నిర్భంధంలోనే ఉండాలని సూచించి డిశ్చార్జి చేసినట్లు వివరించారు. కోవిడ్‌ భాగంలో మొత్తం 77 మందికి వైద్యసేవలను అందిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించిన కరోనా బాధితుల్లో హన్మకొండ అడ్వకేట్‌ కాలనీ, సమ్మయ్యనగర్‌ ప్రాంతాలకు చెందిన భార్యాభర్తలు ఉండగా మిగిలిన వారు మామునూరు, దేశాయిపేట, పల్లగుట్ట, కరీమాబాద్‌, కొత్తవాడకు చెందిన వారు ఉన్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement