- పాఠశాల హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెండింగ్
- 22 నుంచి ఆప్షన్లు ప్రారంభం
కర్నూలు(ఎడ్యుకేషన్), జనవరి 17: జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీల్లో 2730 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు (తెలుగు, హిందీ, ఫిజికల్ డైరెక్టర్) పోస్టుల మినహా మిగతా ఉపాధ్యాయుల బదిలీలు పూర్తయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు బదిలీ ఆప్షన్లు పెట్టుకోవడానికి గడువు ఇచ్చారు. ఇప్పటి వరకు 22 కేటగిరీల్లోని పోస్టులకు బదిలీ ప్రక్రియ పూర్తయింది. 21 సబ్జెక్టు టీచర్స్ బదిలీ కోసం 5730 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 2730 మంది ఉపాధ్యాయులు బదిలీ ఉత్తర్వులు పొందారు. జిల్లాలో 47.64 శాతం నమోదైంది. అత్యధికంగా ఎస్జీటీ (తెలుగు) 3,012 మంది దరఖాస్తు చేసుకోగా 1384 మంది బదిలీ అయి 45.95 శాతం నమోదైంది. అలాగే ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (తెలుగు) 223 మంది దరఖాస్తు చేసుకోగా 140 మంది, ఉర్దూ ముగ్గురు, కన్నడ 8 మంది బదిలీ ఉత్తర్వులు పొందారు. అలాగే ఎస్జీటీ (ఉర్దూ) 282 మందికి గాను 282 మంది దరఖాస్తు చేసుకోగా 166 మంది బదిలీ అయ్యారు. కన్నడ ఉపాధ్యాయులు 13 మంది బదిలీ అయ్యారు. అలాగే స్కూల్ అసిస్టెంట్లు నాన్ లాంగ్వేజె్సలో (తెలుగు) గణితంలో 444 మంది దరఖాస్తు చేసుకోగా, 190 మంది, ఉర్దూ 9 మంది, కన్నడ 3, ఫిజికల్ సైన్స్ (తెలుగు) 455 మందికి గాను, 244 మంది, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ (తెలుగు) 361 గాను 148 మంది, సోషల్ స్టడీస్ (తెలుగు) 371 గాను, 225 మంది బదిలీ అయ్యారు. అలాగే స్కూల్ అసిస్టెంట్లు లాంగ్వేజెస్ (ఇంగ్లీ్ష-నో మీడియం) 458 మందికి గాను 161 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు.