Abn logo
Sep 11 2020 @ 05:18AM

వికారాబాద్‌ జిల్లాలో..26 మంది ఉత్తమ ఉపాధ్యాయులు

Kaakateeya

నేడు విద్యా శాఖ ఆధ్వర్యంలో వారికి పాఠశాలల్లోనే సన్మానం


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో 26 మంది ఉపాధ్యాయులను ఉత్తములుగా ఎంపిక చేశారు. ప్రతిఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సన్మానించే విషయం తెలిసిందే. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంతాప దినాలు కొనసాగుతున్న సమయంలో ఉపాధ్యాయ దినోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాలను వాయిదా వేశారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కోసం 41 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 26 మందిని ఎంపిక చేశారు. అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయుల వివరాలను గురువారం డీఈవో రేణుకాదేవి ప్రకటించారు. జిల్లాలో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులతోపాటు రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన పూడూరు మండలం, కంకల్‌ జడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయుడు వి.సత్యనారాయణను సంబంధిత మండలాల ఎంఈవోలు శుక్రవారం వారి పాఠశాలలకు వెళ్లి కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా సన్మానించనున్నట్లు ఆమె తెలిపారు. 


జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..

టి.వెంకటయ్య (ఎల్‌పీ, జడ్పీహెచ్‌ఎస్‌, చౌదర్‌పల్లి), సి.చంద్రశేఖర్‌రెడ్డి (ఎస్‌జీటీ, ఊట్‌పల్లి), ఎల్‌.ఖాద్యా (ఎల్‌ఎఫ్‌ఎల్‌, మోత్కూరు), కె.శివశంకర్‌ (ఎస్‌జీటీ, ఎంపీపీఎస్‌, బొంపల్లి), హెచ్‌.హన్మంత్‌రెడ్డి (ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, ఘనాపూర్‌), ఎం.హన్మంతు (ఎస్‌ఏ, యూపీఎస్‌, అంతారం), వి.శ్రీనివాస్‌ (ఎస్‌ఏ, కొత్లాపూర్‌), యాదగిరి చింతలగట్టు (ఎస్‌ఏ, దేవరంపల్లి), చిగుళ్లపల్లి వేణుగోపాల్‌ (ఎస్‌ఏ, మోమిన్‌పేట), జి.సుధాకర్‌ (ఎల్‌పీహెచ్‌, టేకులపల్లి), బి.స్వప్న (పీఎస్‌, మేకవనంపల్లి), ఎన్‌.ఇందిర (సీఆర్‌టీ, కేజీబీవీ, నవాబ్‌పేట్‌), పి.భాస్కర్‌రావు (ఎస్‌ఏ, ఎల్లకొండ), కె.వెంకటయ్య (ఎస్‌ఏ, బొంపల్లి), రాకొండ వేణుకుమార్‌ (ఎస్‌జీటీ, నస్కల్‌), జె.శ్రీనివాసులు (ఎస్‌జీటీ, పెద్దేముల్‌), డి.ప్రశాంత (సీఆర్‌టీ, కేజీబీవీ, పెద్దేముల్‌), జి.నర్సిములు (ఎస్‌ఏ, ఇందూరు), బి.హరికృష్ణ (ఎస్‌ఏ, కంకల్‌), ఎన్‌.మహేందర్‌రెడ్డి (ఎస్‌జీటీ, కొత్తపల్లి), కె.జీవనజ్యోతి (పీఈటీ, జీహెచ్‌ఎస్‌, తాండూరు), ఎం.శంకర్‌ (ఎస్‌జీటీ, అంతారంతండా), కె.శ్రీశైలం (ఎల్‌పీహెచ్‌, కోట్‌బాస్‌పల్లి), సయ్యద్‌ మహమూద్‌ (ఎస్‌ఏ, శివారెడ్డిపల్లి), జి.సుభాషిణి (ఎస్‌ఏ, శివారెడ్డిపల్లి), ఆర్‌.కృష్ణయ్య (ఎస్‌ఏ, యాలాల్‌). 

Advertisement
Advertisement