Abn logo
May 21 2020 @ 08:29AM

హైద‌రాబాద్ చేరుకున్న‌ 259 మంది ప్రవాసీయులు

శంషాబాద్‌ రూరల్‌: వందేభారత్‌ మిషన్‌ రెండో దశలో భాగంగా బుధవారం దోహ నుంచి ఎయిరిండియా ఐక్స్‌ 244 విమానం 184 మంది ప్రయాణికులతో రాత్రి 7.26 గంటలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అలాగే సౌదీ అరేబియా నుంచి  ఎయిరిండియా ఏఐ1910 విమానం 75 మంది ప్రయాణికులతో రాత్రి 10.42 గంటలకు దిగింది. ప్రయాణికులకు కొవిడ్‌-19 పరీక్షలు, థర్మల్‌ స్ర్కీనింగ్‌, వైద్య పరీక్షలు చేసి ఆర్టీసీ బస్సుల్లో  క్వారంటైన్‌కు పంపించినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.


Advertisement
Advertisement
Advertisement