Abn logo
Jun 4 2020 @ 02:56AM

256 శ్రామిక్‌ రైళ్లు రద్దు

  • రాష్ట్రాల మధ్య సమన్వయం లేకే: అధికారులు


న్యూఢిల్లీ, జూన్‌ 3: శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల నిర్వహణ పరిసమాప్తి దశకు చేరడంతో 256 శ్రామిక్‌ రైళ్లను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి. వీటిలో మహారాష్ట్ర 105, గుజరాత్‌ 47, కర్ణాటక 38, ఉత్తరప్రదేశ్‌ 30, ఢిల్లీ 7, తెలంగాణ 9, ఆంధ్రప్రదేశ్‌ 6, మధ్యప్రదేశ్‌ 4, తమిళనాడు 4, రాజస్థాన్‌ 2, గోవాల, హరియాణా, కేరళ, ఉత్తరాఖండ్‌ ఒక్కో శ్రామిక్‌ రైలును రద్దుచేశాయి. రైలు బయల్దేరే రాష్ట్రం, గమ్యస్థానానికి చేరుకునే రాష్ట్రం మధ్య సమన్వయం లేకపోవడం వల్ల చాలా రైళ్లు రద్దయ్యాయని అధికారులు తెలిపారు. కాగా గుజరాత్‌ 1026 శ్రామిక్‌ రైళ్లు నడిపిందని, 15 లక్షల మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చిందన్నారు. అలాగే మహారాష్ట్ర 802, కర్ణాటక 127, ఉత్తరప్రదేశ్‌ 294 శ్రామిక్‌ రైళ్లు నడిపాయని వెల్లడించారు. మే 1 నుంచి ఈనెల 3 వరకు 4,197 రైళ్లను నడిపామని, 4,116 రైళ్లు గమ్యస్థానాలకు చేరుకోగా.. 81రైళ్లు రవాణాలో ఉన్నాయని చెప్పారు. అయితే శ్రామిక్‌ రైళ్లకు డిమాండ్‌ పడిపోయిందని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement