Abn logo
Aug 7 2020 @ 03:26AM

సెంట్రల్‌ జైల్లో 247 మందికి పాజిటివ్‌

రాజమహేంద్రవరం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో 247 మంది ఖైదీలు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. శిక్ష పడినవారు, రిమాండ్‌ ఖైదీలు మొత్తం 1666 మంది ఈ జైల్లో ఉన్నారు. సిబ్బంది, ఖైదీల్లో 900మందికి ఇటీవల పరీక్ష నిర్వహించగా, 247మందికి పాజిటివ్‌ వచ్చింది. గతనెలలో ఒక హెడ్‌వార్డర్‌ కరోనాతో మృతి చెందినట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు బయటకు రానీయలేదు. జీఎ్‌సఎల్‌లో కొవిడ్‌ చికిత్స పొందుతూ ఒక ఖైదీ పరారయ్యాడు. అతడిని గురువారం రంపచోడవరం వద్ద పట్టుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించడంలేదు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇదే జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. కాగా, సెంట్రల్‌ జైల్లో కూరగాయలు కోసే విషయంలో ఇద్దరు ఖైదీల మధ్య గురువారం గొడవ జరిగింది. కూరగాయల కత్తితో ఓ ఖైదీ దాడి చేయడంతో మరో ఖైదీ మెడపై తీవ్ర గాయమైంది. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఖైదీకీ కరోనా పాజిటివ్‌ అని తేలినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement