Abn logo
May 28 2020 @ 03:42AM

227 మంది సచివాలయ ఉద్యోగులు రాక

మంగళగిరి, మే 27: సచివాలయ ఉద్యోగులు 2 నెలల తరువాత విధుల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి అమరావతి చేరుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతితో ఏపీఆర్టీసీ నుంచి పది ప్రత్యేక బస్సుల్లో 227 మంది బుధవారం రాష్ట్రానికి చేరుకున్నారు. కాగా, ఉద్యోగులకు, సిబ్బందికి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సీఎస్‌ నీలం సాహ్నికి వినతిపత్రం అందజేశారు.


Advertisement
Advertisement
Advertisement