Abn logo
Sep 22 2021 @ 00:58AM

190 కరోనా కేసులు... ముగ్గురి మృతి

తిరుపతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమ, మంగళవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 190 మందికి కరోనా సోకగా అదే వ్యవధిలో కొవిడ్‌తో రాష్ట్రంలోనే అత్యధికంగా ముగ్గురు మరణించినట్టు జిల్లా యంత్రాంగం గుర్తించింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 242377కు చేరగా మరణాల సంఖ్య 1892కు పెరిగింది. మంగళవారం ఉదయానికి జిల్లాలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 1972 వున్నాయి. తాజా పాజిటివ్‌ కేసులు తిరుపతిలో 29, చిత్తూరులో 19, పీలేరు, కుప్పం మండలాల్లో 13 చొప్పున, తిరుపతి రూరల్‌లో 10, శాంతిపురంలో 8, చంద్రగిరి, కలికిరి మండలాల్లో 7 వంతున, గుడుపల్లెలో 6, రేణిగుంట, సదుం, రామకుప్పం, ఎర్రావారిపాలెం మండలాల్లో 5 చొప్పున, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరు, వి.కోట మండలాల్లో 4 వంతున, పులిచెర్ల, రామచంద్రాపురం, వాల్మీకిపురం, రొంపిచెర్ల, సోమల మండలాల్లో 3 చొప్పున, పుంగనూరు, రామసముద్రం, ఏర్పేడు, బంగారుపాలెం, తొట్టంబేడు, ఐరాల, కార్వేటినగరం, చౌడేపల్లె మండలాల్లో 2 వంతున, పాకాల, కేవీబీపురం, బి.కొత్తకోట, వడమాలపేట, యాదమరి, తంబళ్ళపల్లె, శ్రీరంగరాజపురం, జీడీనెల్లూరు, పెద్దపంజాణి, నిండ్ర, పీటీఎం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.