Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిద్రమత్తులో బ్రష్‌పై పేస్ట్ పెట్టుకున్న యువతి.. తీరా బ్రష్ చేశాక చూస్తే.. విషాదం!

చిన్న చిన్న పొరపాట్లు ఒక్కోసారి సరిదిద్దుకోలేనంత పెద్దవిగా పరిణమిస్తాయి.. ప్రాణాలను హరిస్తాయి. కుటుంబ సభ్యులందరినీ విషాదంలో ముంచెత్తుతాయి.. తాజాగా ఓ యువతి చేసిన చిన్న పొరపాటు ఆమెను ప్రమాదంలో పడేసింది.. నిర్లక్ష్యం ప్రాణాలనే తీసింది.. ముంబైలోని ధారావి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


ముంబైలోని ధారావికి చెందిన అఫ్సానా ఖాన్ అనే 18 ఏళ్ల యువతి కొద్ది రోజుల క్రితం ఉదయాన్నే బాత్రూమ్‌లోకి వచ్చి బ్రష్‌పై పేస్ట్ పెట్టుకుని నోట్లో పెట్టుకుంది. అయితే పొరపాటున టూత్ పేస్ట్‌కు బదులు.. బాత్రూమ్‌లో ఉన్న ఎలుకల మందు పెట్టుకుని బ్రష్ చేసింది. రెండు నిమిషాలకే ఆ విషయం గుర్తించింది. నోటిని పూర్తిగా క్లీన్ చేసుకుని బయటకు వెళ్లింది. అయితే అప్పటికే ఎలుకల మందు ఆమె కడుపులోకి ప్రవేశించింది. రెండ్రోజుల అనంతరం కడుపు నొప్పి, తలతిరగడం వంటి సమస్యలు రావడంతో మెడికల్ షాప్‌నకు వెళ్లి సొంతంగా మందులు కొనుక్కొని వేసుకుంది. 


ఇవి కూడా చదవండి

ఇద్దరూ ఊరు వదిలి పారిపోయారు.. తిరిగి వచ్చాక యువతి తండ్రి, అన్న ఎంత దారుణానికి తెగించారంటే..

Viral Video: భార్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోబోయిన వరుడు.. ఆ నవ వధువు షాకింగ్ రియాక్షన్..

ఇంట్లో వాళ్లకు తెలిస్తే తిడతారనే భయంతో ఆమె సొంత చికిత్స చేసుకుంది. అయితే పరిస్థితి రోజురోజుకూ దిగజారడంతో తన బాధను ఇంట్లో వారికి చెప్పింది. దీంతో వారు వెంటనే అఫ్సానాను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమంగా మారడంతో ఆమె చికిత్సకు సరిగ్గా స్పందించలేదు. దీంతో ఆమె సోమవారం సాయంత్రం ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఎలుకల మందు వల్లే యువతి ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement