Abn logo
Jul 13 2020 @ 15:22PM

కొనసాగుతున్న తరలింపు ప్రక్రియ. ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరిన 327 మంది!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ప్రారంభించిన ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోంది. ఈ మిషన్‌‌లో భాగంగా ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక విమానాల్లో సుమారు 327 మంది భారతీయులు ఆదివారం రోజు ఇండియాకు చేరుకున్నారు. 175 మందితో కువైత్‌ నుంచి బయల్దేరిన గో ఎయిర్ విమానం నిన్న సాయంత్రం 7:40 గంటలకు చండీగఢ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. 152 మందితో యూఏఈ నుంచి బయల్దేరిన మరో విమానం ఆదివారం రోజు ఇండోర్‌లో ల్యాండ్ అయింది. కాగా.. అధికారులు వీరిని క్వారెంటైన్ సెంటర్లుకు తరలించనున్నారు. ‘వందే భారత్ మిషన్‌’ను భారత ప్రభుత్వం మే 7న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 5.80లక్షల మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నారు. 


Advertisement
Advertisement
Advertisement