అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,86,418కి కరోనా కేసులు చేరాయి. అయితే బుధవారం రాష్ట్రంలో కరోనా మరణాలేమీ నమోదు కాలేదు. ఇప్పటివరకు కరోనాతో 7,142 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,637 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 8,77,639 మంది రికవరీ అయ్యారు.