Abn logo
May 29 2020 @ 21:48PM

తండ్రి ఫోన్‌తో ఆ కుర్రాడు చేసిన పనికి.. ఇద్దరూ అరెస్ట్!

చెన్నై: ఇటీవల 11వ తరగతి పరీక్షలు రాసిన ఓ కుర్రాడు తప్పు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. తనతోపాటు తండ్రిని కూడా అరెస్టు చేయించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన ఓ 16 ఏళ్ల కుర్రాడు తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో చైల్డ్ పోర్న్ అప్‌లోడ్ చేశాడు. దీనికోసం తండ్రి మొబైల్‌ను సదరు కుర్రాడు ఉపయోగించాడు. సోషల్ మీడియాలో చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను గుర్తించిన పోలీసులు.. అది ఏ అకౌంట్ ద్వారా అప్‌లోడ్ అయిందీ ట్రాక్ చేశారు. దీనికోసం ఆ కుర్రాడు తండ్రి మొబైల్ ఉపయోగించినట్లు తెలిసి తండ్రీకొడుకులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement