Abn logo
Oct 20 2020 @ 00:00AM

155 పాజిటివ్‌ కేసులు నమోదు

 ముగ్గురు మృతి

కడప, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 155 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 50,203కి చేరాయి. అలాగే మరో ముగ్గురు మృతి చెందారు.

ఇప్పటి వరకు 486 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకున్న 345 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 47,096 మంది కోలుకున్నారు. 2055 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

Advertisement
Advertisement