Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్కూల్ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాలిక.. అక్కడ ఆమె చెప్పింది విని షాకైన పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి..

ఆ బాలిక వయసు 14 సంవత్సరాలు.. తొమ్మిదో తరగతి చదువుతోంది.. సోమవారం సాయంత్రం ఆ బాలిక పాఠశాల నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. తన వయసు 14 సంవత్సరాలని, ఈ నెల 11న తన పెళ్లి జరుగుతోందని, తన పెద్దలకు బుద్ధి చెప్పి ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలని కోరింది.. ఆమె చెప్పింది విన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.. ఆ బాలిక తల్లిదండ్రులను స్టేషన్‌కు రప్పించారు.. ఆ బాలిక చదువు పూర్తయ్యేవరకు పెళ్లి ప్రసక్తి తీసుకురామని ఓ అఫిడవిట్ మీద రాయించి సంతకాలు తీసుకున్నారు.. రాజస్థాన్‌లోని బిళ్వారా గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


బిళ్వారా గ్రామానికి చెందిన బాలిక కృష్ణా మనేరియా స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆ బాలికకు తెలియకుండా ఆమె తల్లిదండ్రులు, తాత ఈ నెల 11న వివాహం నిశ్చయించారు. `మామయ్యతో ఈ నెల 11న నీ పెళ్లి జరుగుతోంది.. సిద్ధంగా ఉండు` అని ఆదివారం ఆ బాలికకు ఆమె తాతయ్య కన్హయ్య చెప్పాడు. దీంతో షాకైన బాలిక ఆ పెళ్లిని ఆపాలని నిశ్చయించుకుంది. తల్లిదండ్రులను ఎంతగా బతిమాలినా వారు పెళ్లిని ఆపేందుకు అంగీకరించలేదు. దీంతో ఆ బాలిక సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఒంటరిగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. 


తనకు బాల్య వివాహం చేసేందుకు తన పెద్దలు ప్రయత్నిస్తున్నారని, ఈ నెల 11న ముహూర్తం పెట్టారని, తనకు ఇంకా చదువుకోవాలని ఉందని చెబుతూ పోలీసులకు కృష్ణ వివాహ ఆహ్వాన పత్రికను చూపించింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. కృష్ణ తల్లిదండ్రులను, తాతను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. కృష్ణకు బాల్య వివాహం చేస్తే అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆమె చదువు పూర్తయ్యే వరకు పెళ్లి ప్రస్తక్తి తీసుకురావద్దని నచ్చ చెప్పారు. ఆ విధంగా వారి చేత హామీ పత్రం రాయించుకుని సంతకాలు పెట్టించుకున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement