Advertisement
Advertisement
Abn logo
Advertisement

104కు ఉత్తమసేవా అవార్డు!

రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం 

డీఎంహెచ్‌వోకు అవార్డు అందజేసిన కలెక్టర్‌


నెల్లూరు(వైద్యం) డిసెంబరు 6 : 104 అంబులెన్స్‌ సేవలకు రాష్ట్రంలోనే బెస్ట్‌ సర్వీస్‌ అవార్డు దక్కింది. 2020-21 సంవత్సరానికిగాను అరబిందో ఫార్మాస్యూటికల్స్‌ రాష్ట్రస్థాయిలో ప్రథమ అవార్డుకు ఎంపిక చేసింది. సోమవారం కలెక్టర్‌ చక్రధర్‌బాబు  నుంచి డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి ఈ అవార్డును అందుకున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 104 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో 20 వాహనాలు ఉండగా ప్రస్తుతం 44 కు చేరాయి. ఏడాది కాలంలో ఓపీ సేవలలో మహిళలు 2,77,220 మంది, పురుషులు 3,72,450 మంది వరకు ఉన్నారు. వీరిలో రక్తపోటు ఉన్నవారు 1,51,009, షుగర్‌ వ్యాధి ఉన్నవారు 1,57,028 మంది ఉన్నారు. 2,00,070 మందికి ఈసీజీ, వివిధ రక్త పరీక్షలు చేశారు. ఇలా అన్నింటా ప్రతిభ చూపినందుకు అరబిందో సంస్ధ అవార్డు ప్రకటించింది. అవార్డు అందిస్తున్న వారిలో జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌కుమార్‌, 104 ప్రతినిధులు ఉన్నారు. 

Advertisement
Advertisement