Abn logo
Jul 17 2021 @ 14:53PM

ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్‌పై వైసీపీ ప్రభుత్వం బురదజల్లుతోంది: పట్టాభి

అమరావతి: ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్‌పై వైసీపీ ప్రభుత్వం బురదజల్లుతోందని టీడీపీ నేత పట్టాభి దుయ్యబట్టారు. జగన్‌ ప్రభుత్వం ఓ వైపు ఫైబర్‌నెట్‌ను వాడుకుంటూనే విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌ను దేశప్రధానే కొనియాడారని, భారత్ డిజిటల్ ప్రాజెక్ట్‌కు ఏపీ నమూనాను ఆదర్శంగా తీసుకోవాలన్నారని గుర్తుచేశారు. రూ.770 కోట్ల ప్రాజెక్ట్‌లో రూ.2 వేలకోట్ల అవినీతి జరిగిందనడం దుర్మార్గమని పట్టాభి అన్నారు.