శ్రీవికారినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్యమాసం, బహుళపక్షం; తిథి: విదియ రా. 8.13 తదుపరి తదియ; నక్షత్రం: పుష్యమి ఉ. 11.50 తదుపరి ఆశ్లేష;
వర్జ్యం: రా.11.37-1.05; దుర్ముహూర్తం: సా.4.27-5.11; అమృతఘడియలు: శే.ఉ.7.22 వరకు; రాహుకాలం: సా.4.30-6.00; సూర్యోదయం: 6.52; సూర్యాస్తమయం: 5.55
దినఫలాలు (జన్మ తేది ప్రకారం)
(జనవరి 18, 2020)

మేషం (మార్చి 21-ఏప్రిల్‌ 20 మధ్య పుట్టినవారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెన్షన్‌, బీమా, మెడికల్‌ క్లెయిమ్స్‌ పరిష్కారం అవుతాయి.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 21 మధ్య పుట్టిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడపుతారు. పందేలు, పోటీలు, న్యాయ వివాదాల్లో విజయం సాధిస్తారు. వేడుకులు, ప్రదర్శనల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది.

మిథునం (మే 22-జూన్‌ 21 మధ్య పుట్టినవారు)

వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. మెడికల్‌ క్లెయిమ్స్‌, అడ్వాన్సులు అందుకుంటారు. సహోద్యోగుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. విందుల్లో పాల్గొంటారు. వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.

కర్కాటకం (జూన్‌ 22 - జులై 22 మధ్య పుట్టిన వారు)

అడ్వర్టైజ్‌మెంట్‌, విద్య, ఫైనాన్స్‌, సృజనాత్మక రంగాల వారికి పోత్ర్సాహకరంగా ఉంటుంది. ప్రేమలు ఫలిస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి.

సింహం (జులై 23 - ఆగస్టు 23 మధ్య పుట్టినవారు)

వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూలం. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ వ్యవహారాలు సమీక్షించుకుంటారు. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.

కన్య(ఆగస్టు 24-సెప్టెంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

ప్రియతముల నుంచి సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. ఏజెన్సీలు, స్టేషనరీ, బోధన, రచనా రంగాల వారికి అనుకూలం. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

తుల(సెప్టెంబర్‌ 23-అక్టోబర్‌ 23 మధ్య పుట్టిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బకాయిలు వసూలవుతాయి. గృహరుణాలు మంజూరవుతాయి. పెట్టుబడులను సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం (అక్టోబర్‌ 24- నవంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. కొత్త ఒప్పందాల గురించి నిర్ణయానికి వస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వాహనం కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి.

ధనుస్సు (నవంబర్‌ 23-డిసెంబర్‌ 21 మఽధ్య పుట్టిన వారు)

ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఎగుమతులు, టెలివిజన్‌, పత్రికా రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆర్థిక విషయాలకు సంబంధించిన రహస్య సమాచారం అందుకుంటారు.

మకరం (డిసెంబర్‌ 22-జనవరి 20 మధ్య పుట్టిన వారు)

బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. యూనియన్లు, సహకార సంఘాల వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తారు. సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. గౌరవ పదవులు అందుకుంటారు. ప్రభుత్వ సంస్థలతో ఎంతో కాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. సంకల్పం నెరవేరుతుంది.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20 మధ్య పుట్టినవారు)

సమావేశాలు, వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆడిటింగ్‌, ఫీజుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ప్రియతములతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది.
దినఫలాలు (జన్మ తేది ప్రకారం)
(జనవరి 17, 2020)

మేషం (మార్చి 21-ఏప్రిల్‌ 20 మధ్య పుట్టినవారు)

గౌరవ, మర్యాదలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పందేలు, పోటీలు, న్యాయ వివాదాల్లో నిరాశ ఎదురుకావచ్చు. ప్రభుత్వ రంగంలోని వారికి శుభప్రదం.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 21 మధ్య పుట్టిన వారు)

సేవలు, వైద్యం, ఆహార రంగాల వారికి లక్ష్యసాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. విందు, వినోదాల్లో పరిమితి పాటించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. సహోద్యోగుల కారణంగా మాటపడాల్సి వస్తుంది. వృత్తిపరమైన సమావేశాలకు అనుకూలం.

మిథునం (మే 22-జూన్‌ 21 మధ్య పుట్టినవారు)

ఇంజనీరింగ్‌, ప్రకటనలు, ఆర్థిక రంగాలకు చెందిన వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. చిన్నారులు, ప్రియతముల కోసం ఖర్చులు అధికం. విలువైన వస్తువుల కొనుగోలులో నాణ్యత గమనించాలి.

కర్కాటకం (జూన్‌ 22 - జులై 22 మధ్య పుట్టిన వారు)

కుటుంబ విషయాలు మనస్తాపం కలిగిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారి అంచనాలు ఫలించకపోవచ్చు. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఇల్లు, స్థలం మార్పు కోసం చేసే యత్నాలకు ఆటంకాలు ఎదుర య్యే అవకాశం ఉంది.

సింహం (జులై 23 - ఆగస్టు 23 మధ్య పుట్టినవారు)

ఏజెన్సీలు, స్టేషనరీ, విద్య, మార్కెటింగ్‌ రంగాల వారికి నిరుత్సాహకరంగా ఉంటుంది. వృత్తిపరమైన చర ్చలు, ప్రయాణాలు ఫలించకపోవచ్చు. సోదరీసోదరుల వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు.

కన్య(ఆగస్టు 24-సెప్టెంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్రీడలు, ప్రకటనల రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. షాపింగ్‌లో నాణ్యత గమనించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవు. రుణప్రయత్నాలు ఫలించకపోవచ్చు.

తుల(సెప్టెంబర్‌ 23-అక్టోబర్‌ 23 మధ్య పుట్టిన వారు)

బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశం ఉంది. ఇల్లు, స్థల సేకరణకు సంబంధించిన నిర్ణయాలకు తగిన సమయం కాదు. చేపట్టిన పనిని ఓరిమితో పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

వృశ్చికం (అక్టోబర్‌ 24- నవంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

గ్రానైట్‌, ఫొటోగ్రఫీ, పర్యాటక రంగాల వారికి ఒక సమాచారం కలవరపెడుతుంది. సినీ, రాజకీయ రంగాల వారు కొత్త ప్రయోగాలకు దూరంగా ఉండాలి. రహస్య సమాచారం అందుకుంటారు. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు.

ధనుస్సు (నవంబర్‌ 23-డిసెంబర్‌ 21 మఽధ్య పుట్టిన వారు)

సహకార సంఘాలు, యూనియన్లకు చెందిన ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. షేర్‌మార్కెట్‌ లావాదేవీల్లో నిదానం పాటించండి. పొదుపు పథకాలపై ఆశించిన పత్రిఫలాలు అందకపోవచ్చు.

మకరం (డిసెంబర్‌ 22-జనవరి 20 మధ్య పుట్టిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు తగిన సమయం కాదు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల విషయంలో ఆశాభంగం తప్పకపోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొంటారు.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వారు)

సినీ, రాజకీయ రంగాల వారి అంచనాలు ఫలించకపోవచ్చు. దూరంలో ఉన్న ప్రియతములకు సంబంధించిన సమాచారం కలవరం కలిగిస్తుంది. న్యాయ, బోధన రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో నిదానం అవసరం.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20 మధ్య పుట్టినవారు)

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. వాయిదా పద్ధతిపై విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది.

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.
153