desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
వారఫలాలు (జన్మ నక్షత్రం ప్రకారం) (09-08-2020)

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: ఓర్పు, పట్టుదలతో శ్రమిేస్త మీదే విజయం. పరిస్థితులు క్రమంగా మెరుగు పడతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఏకపక్ష నిర్ణయాలు తగవు. డబ్బుకు ఇబ్బంది ఉండదు.ఆది, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. మాటతీరు అదుపులో ఉంచుకోండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: ఆలోచనలతో సతమతమవు తారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అవసరాలు వాయిదా వేసుకుం టారు. సోమ, మంగళవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. పత్రాలు అందుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. గృహమార్పు అనివార్యం.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: కార్యసిద్థి ఉంది. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి, వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం సంతృప్తికరం. బుధవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పాత పరిచయస్తులు తారసపడతారు.

కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: సమర్థతను చాటుకుంటారు. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. గురు, శుక్రవారాల్లో అనుకోని సంఘటనలు ఎదుర వుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: అనుకూలతలున్నాయి. లౌక్యంగా మెలగాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందు తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. శని వారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. పిల్లల పై చదువులపై దృష్టి పెడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.

కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: వ్యవహారాలతో తీరిక ఉండదు. మీ తప్పిదాలను సరిదిద్దుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పనులు వేగవంత మవుతాయి. ఆది, సోమవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఇంటి విషయాలు ఏకరవు పెట్టొద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పత్రాలు అందుతాయి. గృహ మరమ్మతులు చేపడతారు.

తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: ప్రతికూలతలు తొలుగుతాయి. కష్టం ఫలిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆది, సోమవారాల్లో శ్రమాధిక్యత, అకాలభోజనం. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పత్రాలు, నగదు జాగ్రత్త. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరో గ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తు లను కలుసుకుంటారు. మీ జోక్యంతో ఒకరికి సద వకాశం లభిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: ఆచితూచి వ్యవహరించాలి. తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. మీ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. బుధ, గురువారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆలోచనలతో సతమతమవు తారు. సన్నిహితుల కలయిక ఊరటనిస్తుంది. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: కష్టం ఫలించకున్నా యత్నించా మన్న సంతృప్తి ఉంటుంది. మీ సమర్థతపై నమ్మ కం పెంచుకోండి. సహాయం ఆశించవద్దు. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శుక్ర, శనివారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు విస్తరి స్తాయి. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: ఈ వారం అనుకూలతలు న్నాయి. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉన్నాయి. పొదుపుపై దృష్టి పెడతారు. ధనసహాయం తగదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఫోన్‌ సందేశాల పట్ల అప్రమ త్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: ధనప్రాప్తి ఉంది. ఇబ్బందులు తొలగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ సలహా ఎదుటి వారికి కలిసివస్తుంది. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. గృహ మరమ్మతులు చేపడతారు.

మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: ఆలోచనలు కార్యరూపం దాల్చు తాయి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. అవిశ్రాం తంగా శ్రమిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి. ఆది, సోమ వారాల్లో పనులు హడావుడిగా ముగిస్తారు. వ్యవ హార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

Advertisement
Advertisement