desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
వారఫలాలు (జన్మ నక్షత్రం ప్రకారం) (10-10-2021)

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. మీ సమర్థత వేరొకరికి కలిసివస్తుంది. ఆది, బుధవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. పరిచ యస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్య క్రమాలు అనుకున్న విధంగా సాగవు. ఆశా వహ దృక్పథంతో మెలగండి. ఖర్చులు విప రీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మి కత పెంపొందుతుంది.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: నిర్దిష్ట ప్రణాళికలతోముందుకు సాగుతారు. అంచనాలు ఫలిస్తాయి. విలాసా లకు వ్యయం చేస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పత్రాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మంగళవారం నాడు అప్రమ త్తంగా ఉండాలి. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆప్తులను విందులకు ఆహ్వా నిస్తారు. గృహం సందడిగా ఉంటుంది.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అతిగా ఆలోచించొద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రప్రభావం చూపుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆగిన పనులు పూర్తవు తాయి. సోమ, గురువారాల్లో వాగ్వాదాలకు దిగవద్దు. మిత్రులను విందుకు ఆహ్వానిస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.

కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఆప్తులకు కలిసివస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది.

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: ఈ వారం శుభదాయకం. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభి స్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త.

కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: పట్టుదలతో కృషి చేస్తే విజయం తధ్యం. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. కొంత మంది మీ ఆలోచనలను నీరుగార్యేందుకు యత్నిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. ఆశిం చిన పదవులు దక్కవు. యత్నాలు కొనసాగిం చండి. శుక్ర, శనివారాల్లో అభియోగాలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించు కోవద్దు. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఖర్చులు విపరీతం.

తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: అనుకూలతలున్నాయి. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభాపాట వాలు వెలుగులోకి వస్తాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. బాధ్యతగా మెలగాలి. మీ ఉన్నతి బంధుమిత్రులకు అసూయ కలిగి స్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహి స్తారు. సోమ, మంగళవారాల్లో పనులు సాగవు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్ని స్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెరిగిన ఖర్చులు ఆందోళన కలిగి స్తాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టిం చుకోవటం శ్రేయస్కరం. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. బుధ, గురువారాల్లో పనులు సాగవు. ఈ చికాకులు తాత్కాలికమే. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసు కుంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: పదవులు, సభ్యత్వాలు స్వీకరి స్తారు. బాధ్యతగా వ్యవహరించండి. పరిచయాలు బలపడతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆత్మీయుల రాక ఉల్లాసం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసిం చవద్దు. శుక్ర, శనివారాల్లో నగదు, ఆభర ణాలు జాగ్రత్త. పెట్టుబడులకు అనుకూలం. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. విశ్రాంతి అవసరం.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. శ్రమాధిక్యత, అకాలభోజనం. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి.ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆది, సోమ వారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవు తాయి. సోదరులతో సంప్రదింపులు జరుపు తారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. మొహమాటాలకు పోవద్దు. శుభకార్యానికి హాజరవుతారు.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: ప్రతికూలతలు అధికం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. దుబారా ఖర్చులు విపరీతం. మంగళ, బుధ వారాల్లో ధనసమస్యలు ఎదురవుతాయి. అవ సరాలు వాయిదా వేసుకుంటారు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పిల్లల చదువులపై మరింత శ్రద్థ వహించాలి.

మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: ఆర్థికస్థితి నిరాశాజనకం. తప్పనిసరి ఖర్చులు ధరలు ఆందోళన కలిగి స్తాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగావసూలు చేసుకోవాలి. గృహంలో స్తబ్థత నెలకొంటుంది. శనివారం నాడు పనులు సాగక విసుగు చెందుతారు. ఈ చికాకులు తాత్కాలికమే. ఓర్పుతో మెలగండి. ఆప్తులతో గడిపేందుకు యత్నించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. వ్యవహారాల్లో మెలకువ వహించండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు.

Advertisement