వెండితెరపై ఎన్టీఆర్, ఏఎన్నార్ అలా దర్శనమీయనున్నారా..?
లనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 'మహానటి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నాడు. ఇతర పాత్రల విషయానికొస్తే.. సమంత జర్నలిస్ట్ పాత్ర పోషిస్తుండగా, ఎస్ వీ రంగారావు పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. మిగిలిన ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. సావిత్రి జీవిత కథ అంటే ఆనాటి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఈ పాత్రల్లో ఆ యంగ్ హీరో, ఈ యంగ్ హీరో కనిపిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయే కానీ.. ఈ ఇద్దరి పాత్రలు చేసే నటులు ఎవరనే విషయం మాత్రం ఇంతవరకు క్లారిటీగా రివీల్ కాలేదు.
 
ఓ వైపు షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం విడుదల సమయం కూడా దగ్గర పడుతోంది. దీంతో ఇంతకూ ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రల్లో ఎవరు కనిపిస్తారో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువైపోయింది ప్రేక్షకుల్లో. అయితే ఈ పాత్రల విషయమై తాజాగా ఫిలింనగర్ సర్కిల్‌లో ఓ వార్త షికారు చేస్తోంది. దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ సన్నివేశాలను నటులతో కాకుండా డిజిటల్ రూపంలో చూపించనున్నారని అంటున్నారు. ఎలాగైతేనేం తమ తమ అభిమాన మహా నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్ లను వెండితెరపై చూడబోతున్నందుకు ఇప్పటి నుండే ఖుషీ అవుతున్నారు అక్కినేని, నందమూరి అభిమానులు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.
Tags :Mahanati, NTR, ANR, roles
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.