ADVT
ఎన్ని మాటలు మారుస్తావు పవన్ కల్యాణ్?: కత్తి మహేష్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీ డిమాండ్ల సాధన కోసం పవన్ కల్యాణ్ ఏర్పాటు చేస్తున్న జేఎఫ్ఎఫ్‌సీ(జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ)పై కత్తి మహేస్ తీవ్రమైన విమర్శలు చేశారు. ‘‘పాచిపోయిన లడ్డుల్ని పరీక్షించడానికి నిజనిర్ధారణ కమిటీ కావాల్సి వచ్చిందా పవన్ కల్యాణ్? ప్రత్యేకహోదాపై నీ నిబద్ధత ఎక్కడ? జేఏసీ బదులు జేఎఫ్ఎఫ్‌సీ ఎందుకొచ్చింది?ఎన్ని మాటలు మారుస్తావు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా ఏమారుస్తావు?’’ అని కత్తి మహేష్ ప్రశ్నించాడు.
 
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటూ ఎన్నికల ముందు మాటిచ్చిన మోదీ అనంతరం ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాట మార్చేసరికి.. ఆ ప్యాకేజీని పవన్ కల్యాణ్ పాచిపోయిన లడ్డూలతో పోల్చిన విషయం తెలిసిందే. ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన వాటిని సాధించుకోవడానికి తెలంగాణ జేఏసీ తరహాలో ఏపీలో కూడా జేఏసీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే జేఏసీ పేరును జేఎఫ్ఎఫ్‌సీగా మార్చారు. దీనిని ప్రశ్నిస్తూ కత్తి మహేష్ ట్వీట్ చేశాడు.
 
 
కత్తి మహేష్ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ పవన్ కల్యాణ్‌కే తన మద్దతు అని చెప్పిన కత్తి మహేష్.. జేఎఫ్ఎఫ్‌సీలో తన పేరు లేకపోయేసరికి ఇలా విమర్శలు చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Tags :Pawan Kalyan, Mahesh Kathi, Janasena Party, Andhra Pradesh

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.