చాలామంది ప్రపోజ్ చేశారు: ప్రియా ప్రకాష్ వారియర్
కే ఒక్క పాటతో యావత్ యూత్‌ని కట్టిపడేసింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ‘ఒరు అదర్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ అంటూ సాగే పాటలో ప్రియా ఇచ్చిన హావభావాలకి యూత్ తట్టుకోలేకపోతున్నారు. అందులోనూ ఫిబ్రవరి 14 కావడంతో ప్రేమికులకు ఈ అమ్మాయి పెద్ద గిఫ్ట్‌గా మారిపోయింది. లవ్‌ని వ్యక్తపరచడానికి కూడా అందరూ ఈ వీడియోనే షేర్ చేస్తుండటంతో టాప్ ట్రెండింగ్‌లో ఈ వీడియో స్థానం దక్కించుకుని సంచలనంగా మారింది. దీంతో తన వీడియోకు వస్తున్న స్పందన పట్ల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడింది ప్రియా. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
 
‘ఇంతటి ఆదరణ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోతో నా జీవితమే మారిపోయింది. ఇంత ఆదరణ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. నా ఆనందాన్ని ఎలా చెప్పాలో అర్థంకావడం లేదు. కనుబొమ్మలతోనే హావభావాలు పలికించాలని దర్శకుడు చెప్పడంతో అలాగే చేశా. ఉత్తర కేరళలో ప్రసిద్ధి చెందిన ‘మప్పిళ’ పాటను ‘మణిక్య మలరయ’గా రీమేక్‌ చేశాం. ఈ వీడియో అలా విడుదలైందో లేదో.. నా ఫోన్ మెసేజ్‌లతో నిండిపోయింది. కొంతమంది సూపర్ అని పొగిడారు. మరికొంత మంది ప్రపోజ్ చేశారు. ఇంకొంతమందైతే ఏకంగా వాలంటైన్స్ డే రోజు డేటింగ్‌కి వస్తావా? అని అడిగారు’ అని చెబుతూనే.. ప్రస్తుతం తాను పూర్తి శ్రద్ద చదువు పైనే పెడుతున్నానని, ఇప్పటివరకు ఎవ్వరినీ లవ్ చేయలేదని చెప్పుకొచ్చింది ప్రియా.
Tags :Priya Prakash Varrier, Song, Interview
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.