ఫ్యాన్స్‌కు వేలంటైన్స్‌డే కానుకనివ్వనున్న స్టార్ హీరో
విజయ్‌ సేతుపతి, సాయేషా, మడోన్నా సెబాస్టి యన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు గోకుల్‌ తెరకెక్కి స్తున్న ‘జుంగా’ షూటింగ్‌ తుదిదశకు చేరుకుంది. సీనియర్‌ నటుడు, నిర్మాత అరుణ్‌ పాండియన్‌, విజయ్‌ సేతుపతి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈలోపు వేలంటైన్స్‌డే కానుకగా 14వ తేదీన ‘జుంగా’ సింగిల్‌ ట్రాక్‌ను విడుదల చేయబోతు న్నారు. ప్రేమ నేపథ్యంతో ఆ పాట సాగనుండడంతో లవ్‌ సాంగ్‌ అని పేరు పెట్టారు. సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీత అందించారు. కాగా, ‘జుంగా’లోనూ విజయ్‌ సేతుపతి విలక్షణ పాత్రలో కనిపించనున్నారు
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.