ఉపాసనకు ఎన్ని పనులో...
రామ్ చరణ్ వైఫ్ ఉపాసనకు ఇవాళ చేయవలిసిన పనుల లిస్ట్ చాలా ఉంది. ఒకవైపు శివరాత్రి పర్వదినం, మరోవైపు తన భర్త నటిస్తున్న రంగస్థలం మూవీ సింగిల్ రిలీజ్. దీంతో ఇవాళంతా ఫుల్ బిజీబిజీగా గడపనుందట. తను చేయాల్సిన పనుల లిస్ట్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది ఉపాసన. హీరోల భార్యల విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండేది ఉపాసన మాత్రమే అని చెప్పాలి. తన పర్సనల్, తన భర్త సినీ విశేషాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది. ‘బిగ్ డే! చేయాల్సినవి చాలా ఉన్నాయి. శివునిలోని బలాన్ని, పాజిటివిటీని మనలో నింపుకోవాలి. హ్యాపీ శివరాత్రి. సాయంత్రం 5గంటలకు రామ్ చరణ్ సాంగ్ రిలీజ్’ అంటూ ఉపాసన ట్వీట్ చేసింది. తను చేయాల్సిన పనుల లిస్ట్‌కు సంబంధించిన పిక్‌ని పోస్ట్ చేసింది.
Tags :upasana, Ram charan
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.