నా కెరీర్లో గ‌ర్వంగా చెప్పుకునే సినిమా అదే: పూరీ జ‌గ‌న్నాథ్‌
వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఎన్టీయార్‌కు `టెంప‌ర్‌`తో మంచి విజ‌యాన్ని అందించాడు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌. అప్ప‌టివ‌ర‌కు ఒకే త‌ర‌హా మాస్ సినిమాలు చేసిన ఎన్టీయార్‌ను ఈ సినిమాలో స‌రికొత్త‌గా ఆవిష్క‌రించాడు. ఈ సినిమాలో ఎన్టీయార్ న‌ట‌న అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది.
 
ఆ సినిమా విడుద‌లై మూడేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా పూరీ జ‌గ‌న్నాథ్ ట్విట‌ర్ ద్వారా త‌న ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నాడు. `నా కెరీర్‌లో నేను గ‌ర్వంగా చెప్పుకునే సినిమా `టెంప‌ర్`. న‌టుడిగా తార‌క్ న‌న్ను ఎంతో ప్ర‌భావితం చేశాడు. క‌థ అందించిన వ‌క్కంతం వంశీకి, ఘ‌న‌విజ‌యం అందించిన ప్రేక్ష‌కులకు ఈ సంద‌ర్భంగా నా కృత‌జ్ఞ‌తలు` అని పూరీ ట్వీట్ చేశాడు. పూరీ ప్ర‌స్తుతం త‌న త‌న‌యుడు ఆకాష్ హీరోగా `మెహ‌బూబా` సినిమా ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు.
Tags :director puri jagannath, TEMPER
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.