నా కుమార్తెపై వస్తున్న వార్తలు నిజం కాదు: సీనియర్ నటి
సినీ ఇండస్ర్టీలో వదంతులు సర్వ సాధారణం. తాజా గా సీనియర్‌ నటి రేఖ కుమార్తె, సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ కుమార్తె సినిమాల్లో నటించబోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలపై వారిద్దరూ స్పందించి, వదంతులుగా కొట్టిపారేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. ‘కడలోర కవిదైగళ్‌’, ‘ఎన్‌ బొమ్ముకుట్టి అమ్మావుక్కు’, ‘పురియాద పుదిర్‌’ తదితర చిత్రాల్లో నటించిన సీనియర్‌ రేఖ ప్రస్తుతం ‘కేని’ అనే చిత్రంలో నటిస్తున్నారు. నాటి అందాల తారలు జయప్రద, రేవతి, అనుహాసన్‌, పార్తిబన్‌, నాజర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమవుతోంది.
 
   కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించేసిన రేఖ అప్పుడ ప్పుడూ ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటిస్తు న్నారు. ‘కేని’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రేఖ కూతురు కూడా సినిమాల్లో ఆరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతోందని వార్తలు వెలువడ్డాయి. అయితే అవన్నీ వదంతులేనని రేఖ కొట్టి పారేశారు. ఆమె మాట్లాడుతూ... వెబ్‌, సోషల్‌ మీడియాలో తన కూతురు సినిమాల్లో నటించబోతుందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని, ఆమె ఉన్నత చదువులపైనే ప్రధానంగా దృష్టి సారిస్తోందని స్పష్టం చేశారు. ఆమె సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని, దయచేసి ఇటువంటి వదంతులను ప్రచారం చేయవద్దని రేఖ కోరారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.