ధైర్యం అంటే నీదే.. : సమంత
టాలీవుడ్ బ్యూటీ సమంత 'ధైర్యం అంటే నీదే..' అంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ని పొగిడింది. కంగనాకు ముక్కుసూటితనం చాలా ఎక్కువ. ఇటీవల హీరో హృతిక్ రోషన్, నటుడు ఆదిత్య పంచోలిపై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. దీంతో కంగనాకు, ఆ ఇద్దరికీ మధ్య ఉన్న పాతవివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
ఇలాంటి ఈ తరుణంలో ఆమె నటించిన ఓ పాట వీడియో బయటకు రావడం చర్చకు దారితీసింది. ఇలా విడుదలైందో లేదో.. అప్పుడే ఈ పాట బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ వీడియో చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు కంగనా ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. కాగా ఈ పాటను చూసిన సమంత.. ట్విట్టర్ వేదికగా కంగానాను అభినందించింది. పాట వీడియోను అందరితో పంచుకుంటూ.. 'లెజెండరీ.. ధైర్యానికంటూ ఓ ముఖం ఉంటే అది నువ్వే మై క్వీన్..' అని ట్వీట్ పెట్టింది సమంత. ప్రస్తుతం సమంత తన పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉంది. మరోపక్క 'రంగస్థలం 1985', 'మహానటి', 'రాజు గారి గది 2' సినిమాల్లో నటిస్తోంది.
Tags :Samantha, tweet, Kangana ranaut