చైతూ-సమంత పెళ్లికి అతిథులుగా ఎన్టీఆర్-రామ్ చరణ్?
చైతన్య-సమంత పెళ్లి ముహూర్తానికి గడువు దగ్గరపడుతోంది. ప్రస్తుతం పెళ్లికి పిలవాల్సిన అతికొద్దిమంది అతిథుల లిస్ట్ కోసం కసరత్తు చేస్తున్నారట ఈ లవ్ బర్డ్స్.
 
వచ్చేనెల 6న టాలీవుడ్‌లో బిగ్ సెలబ్రిటీ మేరేజ్ జరగబోతోంది. ప్రేమపక్షులు నాగచైతన్య-సమంత పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. గోవాలో జరగనున్న ఈ పెళ్లి వేడుకకు దగ్గరి కుటుంబ సభ్యులతో పాటు అతికొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్‌ను మాత్రమే ఆహ్వానించబోతున్నారట. ఈ మేరకు ఓ లిస్ట్ కూడా ప్రిపేర్ అయిందట.
 
పెళ్లికొడుకు నాగచైతన్య లిస్ట్‌లో అందరికంటే ముందున్నాడట రానా నిజానికి రానా, నాగచైతన్య బంధువులే కానీ బ్లడ్ రిలేషన్ కంటే వీళ్లిద్దరి మధ్య స్నేహ బంధమే ఎక్కువ. అందుకే రానాను వ్యక్తిగతంగా ఆహ్వానించబోతున్నాడట చైతూ. ఇక చైతన్య తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అల్లు శిరీష్, నితిన్‌తో పాటు ఎన్టీఆర్ - రామ్ చరణ్‌లను కూడా పెళ్లివేడుకకు వ్యక్తిగతంగా ఆహ్వానించబోతున్నాడట. ఇక పెళ్లికూతురు సమంత బంధువులతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ స్టైలిస్ట్ నీరజ కోనను మాత్రమే పెళ్లికి పిలవబోతుందట. తన తోటి హీరోయిన్స్ అందరినీ రిసెప్షన్‌కే ఆహ్వానించే ఆలోచనలో ఉందట సామ్. మరి చైతన్య-సమంత పెళ్ళికి హాజరయ్యే అతిథుల లిస్ట్ పెరుగుతుందేమో చూడాలి.
 
 
Tags :naga chaitanya, Samantha, WEDDING, DATE, Revealed