హాట్ టాపిక్‌ అయిన.. హీరో మనోజ్ ట్వీట్
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యా సంస్థలను కోరారు. తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఇది తెలుసుకున్న హీరో మంచు మనోజ్.. కేసీఆర్‌ను ఏకంగా ఆకాశానికెత్తేశారు. ట్విట్టర్‌లో కేసీఆర్‌పై కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. "మన మాతృభాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు" అంటూ ట్వీట్ మనోజ్ చేశారు.
 
 
Tags :cm kcr, Manchu Manoj